విజయవాడ (Vijayawada) జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ హైదరాబాద్-విజయవాడ (Vijayawada) హైవేపై ఈ ఘటన జరిగింది. ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్ (35) కుటుంబం జీవనోపాధి కోసం పది రోజుల క్రితమే ఇనాంగూడ ప్రాంతానికి వచ్చింది. ఇవాళ ఉదయం ప్రసాద్ తన రెండేళ్ల కుమారుడితో కలిసి పాల ప్యాకెట్ తీసుకురావడానికి బైక్‌పై వెళ్లారు. ఈ క్రమంలో హైవేపై అతడి బైక్‌ను విజయవాడ వైపు నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కొడుకు చూస్తుండగానే ప్రసాద్స్పాట్ లోనే చనిపోయారు. దిక్కు తోచని స్థితిలో ఏమి జరిగిందో తెలియక తండ్రి డెడ్‌బాడీ పక్కనే బాలుడు ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంటికి పోదామని తన తండ్రిని పట్టుకుని లేపే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలుడి మొహంపై గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Also read:

