Aditirao: విమాన‌శ్రయంలో అదితిరావుకి చేదు అనుభ‌వం

య‌ూకే విమాన‌శ్రయంలో బాలీవుడ్ న‌టి అదితి రావు (Aditirao) హైద‌రీకి చేదు అనుభ‌వం ఎదురైంది. ప్రయాణం అనంతరం తన లగేజీ మాయమైందని, దానికోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఎయిర్ పోర్ట్ అధికారులను సంప్రదిస్తే.. వారు చేతులెత్తేశారని పేర్కొంది. సంబంధిత ఎయిర్‌లైన్ ను సంప్రదించమన్నారని తెలిపింది. ఇక ఎయిర్ పోర్ట్ సర్వీసులపై ఆసహనానికి గురైన అతిది (Aditirao).. ఇంత చెత్త ఎయిర్‌పోర్టును తానెప్పుడూ చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గంట‌ల‌కొద్ది ఎయిర్ పోర్టులో టైమ్ అంతా వృదాగా పోయింద‌ని వాపోయింది. సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవరిస్తార‌ని మండిప‌డింది. దీనిపై ఇన్ స్టా వేదిగా ఓ పోస్ట్ పెట్టింది అతిది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ ఈమె నటించిన హీరామండి: ది డైమండ్ బజార్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో అతిది బిబ్బోజాన్ పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘గాంధీ టాక్స్’ ‘లయనెస్’ సినిమాలో నటిస్తోంది. అదే విధంగా అతిది రావు హైద‌రీ.. -నటుడు సిద్ధార్థ్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనుంది.

Also read: