టీ20 వరల్డ్‌కప్ లో (AFGvsPNG) ఆఫ్ఘనిస్తాన్ టీం సూపర్-8లోకి అడుగుపెట్టింది. పపువా న్యూగునియాతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గునియా (AFGvsPNG).. కేవలం 95 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్.. 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఇకపోతే ఆఫ్ఘన్ బౌలర్ ఫజల్లక్ ఫారూకీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన మూడు వికెట్లు తీసుకున్నాడు. గుల్బదిన్ నయిబ్ 49 రన్స్ స్కోర్ చేసి ఆఫ్ఘన్ విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8లోకి ప్రవేశించింది. గ్రూప్ సి నుంచి న్యూజిలాండ్ జట్టు నాకౌట్ అయ్యింది.
Also read:

