AXIS: బైక్ లోన్ తీసుకొని…

AXIS

ఇన్ స్టాల్ మెంట్ లో బైక్ తీసుకున్న కొందరు వ్యక్తులు యాక్సిస్ (AXIS) బ్యాంకును తప్పుదోవ పట్టించాడు. లోన్​కట్టలేక ఎమ్మెల్యే రాజాసింగ్​ ఫోన్​నెంబర్​ఇచ్చి స్మార్టుగా తప్పించుకున్నారు. షేక్ మహమ్మద్ అనే వ్యక్తి తన పేరు మీద బైక్​తీసుకున్నాడు. దీని కోసం యాక్సిస్ (AXIS) బ్యాంకులో లోన్​తీసుకున్నాడు. రికవరీ కోసం ఇబ్బందిపడుతారమోనన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే రాజాసింగ్​ ఫోన్​నంబర్​ బ్యాంకుకు ఇచ్చాడు. దీంతో​లోన్ కట్టాలి అంటూ యాక్సిస్ బ్యాంకు నుంచి రాజాసింగ్ కు తరచూ ఫోన్ కాల్స్​వస్తున్నాయి. ఇర్ఫాన్ అనే వ్యక్తి మీ నంబర్ ఇచ్చారంటూ టెలికాలర్ ఆయకు సమాధానం తెలిపారు. దీనిపై రాజాసింగ్​మండిపడ్డారు. ఎవరి పడితే వారు నెంబర్ ఇస్తే ఎవరికి పడితే వారికి కాల్ ఎలా చేస్తారు? అని వారిపై ఫైర్​అయ్యారు.

Also read: