Alia Bhatt: అలియా అదుర్స్

Alia bhatt

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా రెడ్ కార్పెట్ పై మెరిసిపోయింది అలియా (Alia Bhatt) . ఈసారి ఆమె మెట్ గాలా రెడ్ కార్పెట్ పై అడుగు పెట్టింది. అలియా భట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూయార్క్ లో ప్రతి ఏటా జరిగే ఫ్యాషన్ ఫెస్టివల్ మెట్ గాలా. ప్రపంచంలోని పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. రెడ్ కార్పెట్ పై అలియా (Alia Bhatt) ట్రెడిషనల్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ కెమెరా మెన్స్ కోరిక మేరకు అలియా వయ్యారంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Image

ఫ్యాన్స్ లో కొందరు అలియా అదుర్స్ అంటే.. మరికొందరు చీరబాగుందన్నారు. 2023లో జరిగిన మెట్ గాలా ఈవెంట్‌లో కూడా అలియా భట్ పాల్గొంది. ఇప్పుడు మరోసారి రెడ్ కార్పెట్ పై మెరిసింది. పెళ్లి తర్వాత అలియా భట్ ఆచితూచి సినిమాలు చేస్తోంది. అలియాకు పెళ్లయిన ఏడు నెలలకే పాప పుట్టింది. ఆ తర్వాత ఆలియా బిడ్డను చూసుకునే పనిలో బిజీగా మారిపోయింది.

Image

ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది ఈ బ్యూటీ. అలియా భట్ మెట్ గాలా రెడ్ కార్పెట్ సందడి చేసిన చీర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారతదేశంలో అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న‌ డిజైనర్లలో ఒకరైన సబ్యసాచి ముఖర్జీ ఈ చీరను డిజైన్ చేశారు. 163 మంది కళాకారులు 1,905 పనిగంటలు కష్టపడి ఈ చీరను తీర్చిదిద్దారు. వోగ్ హోస్ట్‌లతో తన చిట్-చాట్‌లో అలియా ఈ చీర వివరాలను వెల్ల‌డించింది. పల్లుతో పాటు క్లిష్టమైన పూల ఎంబ్రాయిడరీ క్యాస్కేడింగ్ కి ఈ చీర డిజైన్ లో ప్రాధాన్యతనిచ్చారు. మెట్ గాలాలో అలియా ఉనికి ప్రపంచ స్టైల్ ఐకాన్‌ హోదాను ప్రతిబింబించింది.

Image

Also read: