కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లు తోలుతారని ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ప్రజల్ని రెచ్చగొట్టేలా మోదీ (Modi) మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని ఎక్కడికి వెళ్లిన సమాజంలో విభజన సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యుబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే, ఇతర ఇండియా కూటమి నేతలతో కలిసి.. ముంబైలో ఖర్గే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ(Modi)కి ముందు ఏ ప్రధాని ఇలా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆయన ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు కానీ.. ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు ఆయన కట్టుబడి ఉండరని ఖర్గే ఎద్దేవా చేశారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఇటివల ముస్లిం లీగ్ మేనిఫెస్టోగా అభివర్ణించిన ప్రధాని.. ఇప్పుడేమో అది మావోయిస్టు మేనిఫెస్టో అని అంటున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు కొనసాగుతాయని.. వాటిని ఎవరూ టచ్ చేయలేరని చెప్పారు.
Also read :
Prabhas :ప్రభాస్ పెళ్లి ఫిక్స్.?
Rashmika: రష్మికకు మోదీ రిప్లయ్

