హీరో అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ప్రీమియం మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్(Allu cinemas) నిర్మాణం హైదరాబాద్‌లోని కోకాపేటలో పూర్తయింది. సినీ అభిమానులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభూతిని అందించాలనే లక్ష్యంతో రూపొందిన ఈ మల్టీప్లెక్స్ ఇప్పటికే నగర సినీ వర్గాల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. టెక్నాలజీ, డిజైన్, ఆడియో–విజువల్ అనుభవం అన్నింటిలోనూ ఇది పూర్తిగా కొత్త స్థాయిని తీసుకురానుంది.
ఈ మల్టీప్లెక్స్‌లో అత్యాధునిక డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, డాల్బీ విజన్ 3డీ ప్రొజెక్షన్ వంటి లేటెస్ట్ టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద వెడల్పు గల డాల్బీ స్క్రీన్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం. దీనివల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకులు థియేటర్‌లోనే ఉన్నామనే భావన కాకుండా, సినిమా ప్రపంచంలోకి వెళ్లిపోయిన అనుభూతిని పొందుతారని చెబుతున్నారు.

మొత్తం 4 స్క్రీన్‌లతో ఈ ప్రీమియం మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. సీటింగ్ కంఫర్ట్, విజువల్ క్లారిటీ, సౌండ్ క్వాలిటీ అన్నింటినీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్ చేశారు. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా థియేటర్ డిజైన్, టెక్నికల్ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
వచ్చే నెల 19న అల్లు సినిమాస్(Allu cinemas) అధికారికంగా ప్రారంభం కానుంది అని సమాచారం. ఓపెనింగ్ సందర్భంగా రెండు భారీ పాన్ ఇండియా సినిమాలను ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. తొలి సినిమాలుగా ‘ధురంధర్ 2’, ‘టాక్సిక్’ సినిమాలు ప్రదర్శించే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్రదర్శితమైతే, దేశవ్యాప్తంగా అల్లు సినిమాస్ బ్రాండ్‌కు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అల్లు సినిమాస్ ప్రారంభంతో హైదరాబాద్ సినీప్రియులకు కేవలం సినిమా చూడటం మాత్రమే కాకుండా, వరల్డ్ క్లాస్ సినిమా అనుభవం లభించనుంది. ప్రీమియం మల్టీప్లెక్స్‌ల జాబితాలో కోకాపేట ఇప్పుడు ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటుందని, అల్లు అర్జున్ సినిమా వ్యాపారంలోనూ సరికొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించబోతున్నారని అభిమానులు విశ్వసిస్తున్నారు.
Also Read:

