America: సుంకాల తగ్గింపునకు భారత్ ఒప్పుకుంది

America

అమెరికా (America) పై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ అత్యధికంగా సుంకాలు వసూలుచేస్తోందని, ఆ దేశంలో ఏవీ విక్రయించడానికి వీలు లేనంత భారంగా ఉన్నాయని వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రస్తావించారు. ఈ అంశాన్ని లేవనెత్తడంతో ఆ దేశం దిగివచ్చిందని అన్నారు. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని టెస్లా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం భారత్‌ కార్ల దిగుమతిపై 110శాతం సుంకాలు విధిస్తోంది. ఈ విషయంపై ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే పలుమార్లు భారత్‌పై బహిరంగానే విమర్శలు చేశాడు. ప్రస్తుతం టెస్లా భారత్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మా వద్దే వెపన్స్ కొనాలి భారత్‌ ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడొద్దని, తమ వద్దే ఆయుధాలు కొనుగోలు చేయాలంటూ షరతు విధించారు. అప్పుడే భారత్‌, అమెరికా (America) సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు న్యాయంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే తమతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికన్ దిగుమతులపై సుంకాలను తగ్గించాలని భారత్ ను కోరారు.

Image

అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ అత్యధికంగా సుంకాలు వసూలుచేస్తోందని, ఆ దేశంలో ఏవీ విక్రయించడానికి వీలు లేనంత భారంగా ఉన్నాయని వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రస్తావించారు. ఈ అంశాన్ని లేవనెత్తడంతో ఆ దేశం దిగివచ్చిందని అన్నారు. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని టెస్లా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం భారత్‌ కార్ల దిగుమతిపై 110శాతం సుంకాలు విధిస్తోంది. ఈ విషయంపై ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే పలుమార్లు భారత్‌పై బహిరంగానే విమర్శలు చేశాడు. ప్రస్తుతం టెస్లా భారత్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మా వద్దే వెపన్స్ కొనాలి భారత్‌ ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడొద్దని, తమ వద్దే ఆయుధాలు కొనుగోలు చేయాలంటూ షరతు విధించారు. అప్పుడే భారత్‌, అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు న్యాయంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే తమతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికన్ దిగుమతులపై సుంకాలను తగ్గించాలని భారత్ ను కోరారు.

Image

Also read: