–సీట్ల సర్దుబాటు కుదరాల్సి ఉంది
–తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా జరపాలి
–కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాం
–సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీతో(Congress) తమకు రాజకీయ అవగాహన కుదిరిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హిమాయత్‌నగర్‌లోని మగ్ధూం భవన్లో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్‌తో పొత్తులపై చర్చ జరుగుతోంది. సీపీఐ, సీపీఎం నుంచి చెరో 5 సీట్లు చొప్పున ప్రతిపాదన పెట్టాం. కమ్యూనిస్టు పార్టీలు కేవలం పోరాటాలే కాకుండా చట్టసభల్లో నాయకత్వం ఉండటానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే వాళ్లతో మాకు రాజకీయ అవగాహన కుదిరింది. సీట్ల సర్దుబాటు కుదరాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ (Congress) స్క్రీనింగ్ సమావేశం జరుగుతోంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తే స్థానాల లిస్టులో తమ పార్టీవి కూడా ఉంటాయి’ అని నారాయణ తెలిపారు.
అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రక్రియ
‘అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ లను కాదని అనుకూల బృందాలను ఎన్నికల్లో దింపడం బ్యూరోకాట్స్‌ను అవమానించడమే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాం. ఎన్నికలకు 6 నెలల ముందే ప్రభుత్వాలు వాగ్దానాలు ఇచ్చి అమలు చేసుకోవాలి. కానీ ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కంటే ముందుగానే పథకాలను, అధికారులను బదలాయింపు చేస్తూ మోసం చేస్తుంది. ఇప్పుడున్న కేంద్ర ఈసీఐ అధికారి ఎక్కడో ఉంటే ఫస్ట్ ప్లేస్‌కు వచ్చారు. ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పతున్నారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీపీఐ, సీపీఎంలు కలిసి బలమైన స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కాకుండా వామపక్షాలు విడిగా పోటీ చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు.
Also Read: