ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ(Anant ambani), ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ న్యూయార్క్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ లిస్టులో స్థానం సంపాదించారు. వీళ్ల వివాహం ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రతి వేడుకలో వధూవరులు ధరించిన దుస్తులు, ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేశాయి. ‘మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024’ జాబితాలో అనంత్- రాధిక అత్యంత స్టైలిష్ వ్యక్తుల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
వీళ్ల ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ వేదికైంది. వారి పెళ్లికి దేశదేశాల నుంచి ప్రముఖ నటీనటులు, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన రిహన్నా, కేటీ పెర్రీ, ఆండ్రియా బోసెల్లి వంటి సెలబ్రిటీలు, ప్రపంచ దేశాల నేతలు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు అతిథులుగా వచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీరిరువురు పలు విలువైన ఫాషన్ దుస్తుల్లో మెరిశారు. వారి ఆచారాల ప్రకారం ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలైన వివాహ వేడుకలు.. ‘శుభ్ ఆశీర్వాద్’, ‘మంగళ్ ఉత్సవ్’తో ముగిశాయి.
Also Read :

