Ananya Panday: లైగర్ బ్యూటీ..లవ్ బ్రేకప్?

ananya pandey

లైగ‌ర్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ.. అనన్య పాండే (Ananya Panday)  ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఈ అమ్మడికి ఇక్కడ అంతగా అవకాశాలు రాలేదనే చెప్పుకోవాలి. ఇటీవ‌ల కాలంలో సినిమాల కంటే ఎఫైర్ క‌థ‌నాల‌తోనే ఎక్కువ‌గా హైలైట్ అవుతోంది అన‌న్య (Ananya Panday). బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యరాయ్ క‌పూర్ తో డేటింగ్ చేస్తోంద‌నే వార్తలు చాలా కాలంగా షికార్లు చేస్తున్నాయి. వీరు ఫారెన్ ట్రిప్ లు, ఔటింగులకు వెళ్లడం, ముంబై ఔట‌ర్‌ రిసార్టుల్లో తిరగడం లాంటి విష‌యాలు మీడియా హెడ్ లైన్స్ లో నిలిచాయి.

Image

లైగ‌ర్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ.. అనన్య పాండే   ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఈ అమ్మడికి ఇక్కడ అంతగా అవకాశాలు రాలేదనే చెప్పుకోవాలి. ఇటీవ‌ల కాలంలో సినిమాల కంటే ఎఫైర్ క‌థ‌నాల‌తోనే ఎక్కువ‌గా హైలైట్ అవుతోంది అన‌న్య . బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యరాయ్ క‌పూర్ తో డేటింగ్ చేస్తోంద‌నే వార్తలు చాలా కాలంగా షికార్లు చేస్తున్నాయి. వీరు ఫారెన్ ట్రిప్ లు, ఔటింగులకు వెళ్లడం, ముంబై ఔట‌ర్‌ రిసార్టుల్లో తిరగడం లాంటి విష‌యాలు మీడియా హెడ్ లైన్స్ లో నిలిచాయి.దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లికి సిద్ధమ‌వుతోంద‌నే ప్రచారం కూడా జరిగింది. ఇంత‌లోనే వీరిద్దరూ విడిపోయారంటూ మ‌రో వార్త సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతోంది. అన‌న్య తన ఇన్ స్టాలో పెట్టిన క్రిప్టిక్ పోస్ట్ ఈ పుకార్లకు కార‌ణ‌మైంది. అన‌న్య పాండే- ఆదిత్య రాయ్ కపూర్ నుంచి విడిపోతోంద‌ని హిందీ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. తన లవ్ బ్రేకప్ అయిన కారణంగానే అనన్య ఈ పోస్ట్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి.’ఖో గయే హమ్ కహాన్‌’ అనే ఓటీటీ సినిమాలో కనిపించిన అనన్య.. ప్రస్తుతం కంట్రోల్, దర్బార్, శంకర వంటి సినిమాలు చేస్తోంది. కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.

Image

Also read: