Anganwadi: గుడ్లు మందుబాబులకు స్టఫ్!

Anganwadi

పిల్లల ఆరోగ్యరక్షణకు, పిల్లల్లో పోషకాహార లోపం నిర్మూలన ప్రభుత్వం (Anganwadi) అంగన్వాడీల ద్వారా అందిస్తున్న గుడ్లు దుర్వినియోగం అవుతున్నాయి. (Anganwadi) అంగన్వాడీల్లో పిల్లలకు అందాల్సిన గుడ్లు పక్కదారి పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వైన్ షాపు పర్మిట్ రూంలో అంగన్వాడీ గుడ్లు మందుబాబులకు స్టఫ్ గా మారాయి.. పిల్లలకు పెట్టాల్సిన గుడ్లను అక్రమంగా వైన్ షాపు పర్మిట్ రూంలకు అమ్ముతున్నారు.


సెప్టెంబర్19న హుజూరాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న ఓ వైన్ షాపులో పర్మిట్ రూంలో అంగన్వాడీ గుడ్లను గుర్తించారు అధికారులు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పర్మిట్ రూంను తనిఖీ చేసిన అధికారులు.. పిల్లలకు అందాల్సిన అంగన్వాడీ గుడ్లు పర్మిట్ రూంలో మందుబాబులకు స్టఫ్ గా అమ్ముతున్నారు గుర్తించారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

Image

పిల్లల పోషకాహార రక్షణ కోసం అంగన్వాడీల్లో అందించే గుడ్లు పక్కదారి పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈ దుర్వినియోగం బయటపడింది.

సెప్టెంబర్ 19న కరీంనగర్ రోడ్డులోని ఒక వైన్ షాపు పర్మిట్ రూంలో అంగన్వాడీ గుడ్ల గుట్టు రట్టయింది.స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన అధికారులు తనిఖీ చేయగా, పిల్లలకు అందాల్సిన గుడ్లు మందుబాబులకు స్టఫ్గా అమ్ముతున్నట్టు తేలింది.ఈ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పిల్లల హక్కులను దోచుకుంటున్నారని మండిపడ్డారు.బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Also read: