బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై (Annamalai) వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన తెలిపారు. అన్నా యూనివర్శిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై అన్నామలై (Annamalai)ప్రెస్‌మీట్ పెట్టారు. 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి వివరాలు ఉన్న ఎఫ్‌ఐఆర్ లీక్ అవ్వడంపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పోలీసులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

బాధితురా లే భయపడేలా పోలీసులు ఎఫ్ఐఆర్ రాయడాన్ని ఖండించారు. డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అన్నా యూనివర్శిటీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జ్ఞానశేఖరన్ గతంలో కూడా నేరాలు చేశాడని అన్నామలై (Annamalai) ఆరోపించారు. డీఎంకే నేతలతో ఉన్న కారణంగా పోలీసుల ఆయనపై రౌడీ షీట్ తెరవలేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకేను అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు వేసుకోబోనని బీజేపీ చీఫ్ అన్నామలై (Annamalai) ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ.. ఇకపై తాను రెగ్యులర్ రాజకీయాలు చేయబోనని అన్నారు.
Also read :
P.V.Sindhu : శ్రీవారి సేవలో పీవీ సింధు దంపతులు
Mufasa : ముఫాసా కలెక్షన్ రూ. 74 కోట్లు

