వ్యక్తిగత పగలతో భర్త, అతని కుటుంబంపై ఓ మహిళ ‘‘వరకట్న వ్యతిరేక చట్టం’’(Anti-Dowry Act) ప్రయోగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది అవసరంగా భర్తలను వేధించడం కిందకే వస్తుందని, ఇలాంటి కేసుల విషయంలో ఇకపై తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించింది. దారా లక్ష్మీనారాయణ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం, ఇతరులు కేసులో జస్టిస్ బీవీ నాగరత్న, కోటేశ్వర్ సింగ్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల రక్షణకు ఉద్దేశించి రూపొందించిన వరకట్న వ్యతిరేక చట్టాన్ని (“Anti-Dowry Act”) భర్తపై పగతో, అతని కుటుంబంపై కక్షతో ప్రయోగించడం ఈ మధ్య కాలంలో కనిపిస్తోందని తెలిపింది. చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోర్కెలు నెరవేర్చుకోవడానికి దీనొక్క ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి ధోరణిని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది.
వ్యక్తిగత పగలతో భర్త, అతని కుటుంబంపై ఓ మహిళ ‘‘వరకట్న వ్యతిరేక చట్టం’’ ప్రయోగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది అవసరంగా భర్తలను వేధించడం కిందకే వస్తుందని, ఇలాంటి కేసుల విషయంలో ఇకపై తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించింది. దారా లక్ష్మీనారాయణ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం, ఇతరులు కేసులో జస్టిస్ బీవీ నాగరత్న, కోటేశ్వర్ సింగ్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల రక్షణకు ఉద్దేశించి రూపొందించిన వరకట్న వ్యతిరేక చట్టాన్ని భర్తపై పగతో, అతని కుటుంబంపై కక్షతో ప్రయోగించడం ఈ మధ్య కాలంలో కనిపిస్తోందని తెలిపింది. చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోర్కెలు నెరవేర్చుకోవడానికి దీనొక్క ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి ధోరణిని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది.
తెరపైకి బెంగుళూరు టెకీ ఘటన
భార్య పెట్టిన వేధింపులు భరించలేక అతుల్ సుభాష్ అనే బెంగళూరు టెకీ బలవనర్మణానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకొని మరీ సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తాను రాసిన సూసైడ్ నోట్ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరాలన్నది అతని కోరిక. అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే.. వైవాహిక చట్టాల దుర్వినియోగంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.
Also read:
- Hyderabad:హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్
- Vikarabad district: తాండూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్

