ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ (Arrest)చేశారు. ఇవాళ మధ్యాహ్నం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన దిల్లీ పోలీసు బృందం.. బిభవ్‌ను అదుపులోకి తీసుకుంది. అనంతరం విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌ను తరలించింది. ఇదిలా ఉండగా.. కేజ్రీవాల్ నివాసంలో సెక్యూరిటీ సిబ్బందితో స్వాతి వాగ్వాదానికి దిగిన వీడియో నిన్న వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పోస్టు చేసింది.వీడియోలో కేజ్రీవాల్ నివాసంలో నుంచి సెక్యూరిటీ సిబ్బంది స్వాతిని బయటకు పంపిస్తున్నట్లు కనిపించింది. ఇంటి బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది నుంచి విడిపించుకునేందుకు ఆమె ప్రయత్నించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీసులతో స్వాతి మాట్లాడారు.
రిపోర్ట్ ఇది..
స్వాతి మాలీవాల్ మెడికల్ రిపోర్ట్ బయటకొచ్చింది. దీని ద్వారా స్వాతి ఎడమ కాలుపై గాయం, కుడి కన్ను కింద గాయం గుర్తులు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం నాలుగు చోట్ల గాయం గుర్తులు ఉన్నట్లు అందులో ఉంది. తలపై గాయమైందని కూడా మెడికల్ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. కడుపు, పొత్తికడుపు, ఛాతీలో గాయాలతో పాటు కింద పడిపోవడంతో ఆమె కాళ్లకు సైతం గాయం అయినట్లు అర్థమవుతోంది.
Also read :
Vijayashanti : నా ఉద్దేశం అదికాదు

