Alwal: అల్వాల్​లో దారుణం

Alwal

అర్ధరాత్రి కారులో తిప్పుతూ మహిళపై లైంగికదాడిభర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ లైంగిక దాడికి గురైంది. (Alwal) అల్వాల్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాప్రాల్‌కు చెందిన 29 ఏళ్ల మహిళ తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు ఈనెల 12న సాయంత్రం ఉబెర్​ఆటో బుక్​చేసుకుని అల్వాల్‌ పీఎస్ కు వెళ్లింది. అయితే ఆమెపై కన్నేసిన ఆటో డ్రైవర్‌.. ఫిర్యాదు చేసి బయటకొచ్చిన ఆమహిళను యాప్రాల్‌లో దించుతానని ఎక్కించుకున్నాడు. ఆమెను మాటల్లో పెట్టి.. అన్ని సిటీ అంతా తిప్పుతూ ఓ వైన్‌ షాప్‌ దగ్గర ఆపి ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నాడు. బలవంతంగా ఆ మహిళకు కూడా మందు తాగించారు. అనంతరం ఆటోను (Alwal) అల్వాల్‌లోని వెంకట్రావ్‌ లేన్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరించి ఓ కారు ఎక్కించారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోగా.. మిగిలిన ఇద్దరూ కారులోనే ఆమెపై లైంగికదాడి చేశారు. వాళ్ల నుంచి తప్పించుకున్న మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇవ్వగా, పోలీసులు ఆ ఆటో డ్రైవర్ శంకర్​ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.అర్ధరాత్రి కారులో తిప్పుతూ మహిళపై లైంగికదాడిభర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ లైంగిక దాడికి గురైంది. అల్వాల్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాప్రాల్‌కు చెందిన 29 ఏళ్ల మహిళ తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు ఈనెల 12న సాయంత్రం ఉబెర్​ఆటో బుక్​చేసుకుని అల్వాల్‌ పీఎస్ కు వెళ్లింది. అయితే ఆమెపై కన్నేసిన ఆటో డ్రైవర్‌.. ఫిర్యాదు చేసి బయటకొచ్చిన ఆమహిళను యాప్రాల్‌లో దించుతానని ఎక్కించుకున్నాడు. ఆమెను మాటల్లో పెట్టి.. అన్ని సిటీ అంతా తిప్పుతూ ఓ వైన్‌ షాప్‌ దగ్గర ఆపి ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నాడు. బలవంతంగా ఆ మహిళకు కూడా మందు తాగించారు. అనంతరం ఆటోను అల్వాల్‌లోని వెంకట్రావ్‌ లేన్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరించి ఓ కారు ఎక్కించారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోగా.. మిగిలిన ఇద్దరూ కారులోనే ఆమెపై లైంగికదాడి చేశారు. వాళ్ల నుంచి తప్పించుకున్న మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇవ్వగా, పోలీసులు ఆ ఆటో డ్రైవర్ శంకర్​ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also read:

Ginger garlic paste: యాసిడ్ తో అల్లం పేస్ట్​తయారు చేస్తుండ్రు

Tejaswini: మోక్షజ్ఞ సినిమాకు నిర్మాత !