Avatar 3: అవతార్​3 ఫస్ట్​లుక్​

అవతార్ 3 ఫస్ట్‌లుక్ రిలీజ్ – మరో విజువల్ వండర్‌కు తెరలేపిన జేమ్స్ కామెరూన్.

విజువల్ ఎఫెక్ట్స్‌ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన చిత్రం అవతార్(Avatar 3) . హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల్ని విశ్మయం లో ముంచెత్తింది. మొదటి భాగం 2009లో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. అనంతరం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ రూపంలో రెండో భాగం కూడా భారీ హైప్ మధ్య విడుదలై సంచలనం రేపింది.

ఇప్పుడు, అవతార్ ఫ్రాంచైజీలో మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్ పోషించిన వరంగ్ అనే కీలక పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఊనా చాప్లిన్ తన నటనతో బలమైన పాత్రలకు న్యాయం చేసే నటి కాగా, ఆమె పాత్ర ఈ చిత్రంలో చాలా కీలకంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.(Avatar 3)

ఈ సందర్భంగా చిత్రబృందం ఒక స్పెషల్ అప్డేట్ కూడా ఇచ్చింది. ఈ వారంలో విడుదల కాబోయే హాలీవుడ్ మూవీ ‘ది ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ చిత్రంతో పాటు ‘అవతార్ 3’ ట్రైలర్‌ను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. దీని ద్వారా ప్రేక్షకులకు అవతార్ 3 లోని కొత్త పాత్రలు, విజువల్ ఎలిమెంట్స్, కథాబీజం మొదలైన అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా 2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత, ఫ్రాంచైజీలో మరో రెండు భాగాలు కూడా విడుదల కానున్నాయి. నాలుగవ భాగం 2029లో, ఐదవ భాగం 2031 డిసెంబర్లో విడుదల కానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది చూస్తుంటే, జేమ్స్ కామెరూన్ నిర్మాణ శైలి, ప్రపంచ స్థాయి విజువల్స్, పాత్రల లోతైన ఆవిష్కరణలతో మరోసారి ప్రేక్షకులకు అద్భుత అనుభూతి కలిగించబోతున్నాడు అనడం అతిశయోక్తి కాదు.

Also Read: