Ayesha khan: చిక్కుల్లో ఆయేషా

వివాదంలో చిక్కుకున్న నటి ఆయేషా ఖాన్: కాశ్మీర్ విషయంలో చేసిన లైక్ వివాదాస్పదం.

టెలివిజన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆయేషా ఖాన్ (Ayesha khan)ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకుపోయింది. సాధారణంగా తన ఫ్యాషన్ సెలెక్షన్స్‌తో, స్టైలిష్ లుక్స్‌తో, ట్రెడిషనల్ సారీస్‌తో గ్లామరస్‌యెట్ గ్రేస్‌ఫుల్‌గా కనిపించే ఆయేషా, సోషల్ మీడియా ఫాలోవర్లకు తరచూ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది. ‘బిగ్ బాస్ 17’ ద్వారా ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

అయితే, ఇటీవల ఆమె ఒక వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు లైక్ ఇవ్వడం వల్ల ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “భారతీయులకు కాశ్మీర్‌కు స్వాగతం లేదు” అనే ఓ పోస్ట్‌ను రచయిత జలీస్ హైదర్ పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో కాశ్మీర్‌ను కేవలం పర్యాటక దృష్టితో చూడడాన్ని తప్పుబడుతూ, అక్కడి ప్రజల నిత్య జీవిత సవాళ్లను, బాధలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది. పైగా, “కాశ్మీర్ ప్రపంచంలోనే అత్యధికంగా మిలిటరైజ్ అయిన ప్రాంతం” అని పేర్కొంటూ, అక్కడి ప్రజల పరిస్థితిని ఇగ్నోర్ చేస్తూ రొమాంటిక్‌లా చూడడం దారుణమని విమర్శలు ఉన్నాయి.(Ayesha khan)

ఈ అభ్యంతరకర పోస్టుకు ఆయేషా లైక్ చేయడం ద్వారా ఆమెపై దేశవాళీగా విపరీతమైన విమర్శలు వచ్చాయి. కొందరు ఆమెపై దేశవిరోధి అభిప్రాయం ఉన్నదంటూ సోషల్ మీడియాలో దుయ్యబట్టారు. టెలివిజన్ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత రవీ దూబే అయితే ఆయేషాను రాబోయే “దిల్ కో రఫూ కర్ లే” అనే టీవీ షో నుంచి తొలగించాలని సూచించారు.

ఇక మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ముంబై పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. “ఇది కేవలం లైక్‌ చేస్తే సరిపోతుందా? ఆమె ఉద్దేశాలు ఏమిటో తెలుసుకోవాలి,” అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

ఆయేషా ఖాన్‌ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే ఈ వివాదం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశముందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో సెలెబ్రిటీల ప్రతి చర్యకు పెద్ద పర్యవసానాలే ఉండే కాలంలో, ఈ ఉదంతం నటీనటులకు హెచ్చరికగా మారిందనే చెప్పవచ్చు.

Also Read :