బిగ్ బాస్–17(హిందీ)తో బుల్లితెరపై గత ఏడాది సందడి చేసిన భామ ఆయేషాఖాన్(Ayesha Khan) . బుల్లి తెర ద్వారా ఎంట్రీ ఇచ్చిన భామ ఇప్పుడు టాలీవుడ్ లోనూ సందడి చేస్తోంది. 2022లో ముఖచిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ ఓం బీం బుష్ సినిమాతో అందరికీ సుపరిచతమైంది. తర్వాత విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో మెప్పించింది.

మనమే సినిమాలోనూ నటించిందీ భామ. ప్రస్తుతం ఈ అమ్మడు (Ayesha Khan) నటించిన లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ 31న థియేట్రికల్ రిలీజ్ కానుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ అలెర్ట్ గా ఉండే ఈ అమ్మడు కొన్ని ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంది.

సంప్రదాయ చీరకట్టులో ముక్కుపుడక ధరించి హొయలు పోతూ ఇచ్చిన పోజులకు అభిమానులు ఫిదా అవుతున్నార.

సూపర్ ఎక్సలెంట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు లవ్ సింబల్స్ పెడుతూ ముద్దులతో ముంచెత్తుతున్నారు.
Also read :
Handloom workers: నేతన్న శుభవార్త
Rajasthan: రూ. 4 కోట్ల నాగుపాము విషం సీజ్!
