Ayodhya: అయోధ్య రామాలయ  ప్రధాన అర్చకుడి కన్నుమూత

Ayodhya

(Ayodhya) రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌(85) కన్నుమూశారు.  ఈ  నెల 3న అనారోగ్యం బారిన పడిన ఆయనను లక్నో లోని  సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్పించారు. సత్యేంద్ర దాస్‌ డయాబెటిక్, బీపీతో బాధపడుతూ దవాఖానలో చేరినట్లు డాక్టర్లు తెలిపారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్రదాస్‌ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్న విషయం తెలిసిందే. 20 ఏళ్ల వయసులోనే నిర్వాణి అఖాడాలో చేరారు. అప్పట్నుంచి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. గతేడాది (Ayodhya) అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలోనూ కీలక పాత్ర పోషించారు. అయోధ్య మందిర నిర్మాణం తర్వాత అక్కడ రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు.

Image

రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌(85) కన్నుమూశారు.  ఈ  నెల 3న అనారోగ్యం బారిన పడిన ఆయనను లక్నో లోని  సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్పించారు. సత్యేంద్ర దాస్‌ డయాబెటిక్, బీపీతో బాధపడుతూ దవాఖానలో చేరినట్లు డాక్టర్లు తెలిపారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్రదాస్‌ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్న విషయం తెలిసిందే. 20 ఏళ్ల వయసులోనే నిర్వాణి అఖాడాలో చేరారు. అప్పట్నుంచి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. గతేడాది అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలోనూ కీలక పాత్ర పోషించారు. అయోధ్య మందిర నిర్మాణం తర్వాత అక్కడ రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు.

Image

Also read: