Ayyappa Devotees: విమానంలో శబరిమల వెళ్తున్నారా?

Ayyappa Devotees

శబరిమల యాత్ర సీజన్‌లో (Ayyappa Devotees) అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని ప్రకటించింది. ఇప్పటి వరకూ విమానాల్లో ఇరుముడిని తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా చెక్ ఇన్ లగేజీగా పంపించాల్సిన నిబంధన ఉండేది. అయితే భక్తుల నుండి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో పౌరవిమానయానశాఖ ఈ నిబంధనను సడలించింది. ఇకపై ఇరుముడిని (Ayyappa Devotees) భక్తులు తమ వెంట విమానంలో క్యాబిన్‌లో తీసుకెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ నూతన నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చి జనవరి 20 వరకు కొనసాగుతుంది.

Image

ఈ కొత్త నిర్ణయం ముఖ్యంగా డెక్క్షలో ఉన్న, శబరిమల మాలధారణ చేసిన భక్తులకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఇరుముడి అయ్యప్ప దీక్షలో అత్యంత పవిత్రమైనది. దీన్ని చేత బట్టకుండా ఇతరుల చేతుల్లో పెట్టడం, భూమిపై ఉంచడం భక్తులు శాస్త్రపరంగా చేయరు. కానీ విమాన నిబంధనల ప్రకారం చెక్‌ఇన్‌లో పంపాల్సి రావడంతో ఎన్నో మంది భక్తులు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా భక్తులు సోషల్ మీడియాలో అభ్యర్థనలు చేస్తూ వీడియోలు షేర్ చేశారు.

అయిటివంటిదే ఒక వీడియో ఎక్కువ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో భక్తులు తమ వినతిని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వంటి ప్రముఖులను ట్యాగ్ చేశారు. ఈ వీడియో విస్తృత ప్రచారం పొందడంతో పౌరవిమానయానశాఖ వెంటనే స్పందించింది.

Image

భక్తుల ఆధ్యాత్మిక భావనను గౌరవిస్తూ, శాస్త్రోక్త ఆచారాలను కొనసాగించడానికి సౌకర్యంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకు కొత్త మార్గదర్శకాలను పంపించినట్లు సమాచారం. అయితే దీనితోపాటు కొన్ని షరతులను కూడా ఏవియేషన్ శాఖ సూచించింది:

Image

  1. ఇరుముడిలో నిషేధిత పదార్థాలు లేకపోవాలి

  2. సెక్యూరిటీ స్కానింగ్ సమయంలో భక్తులు సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి

  3. ఇరుముడి నుంచి ఎక్కడా ద్రవాలు లేదా జ్వాలాశీల పదార్థాలు లీక్ కాకుండా జాగ్రత్త పడాలి

ఈ నిర్ణయం పట్ల శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న భక్తులలో విశేష ఆనందం నెలకొంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతం, ఉత్తర భారతదేశం, విదేశాల నుంచి వచ్చే భక్తులు విమానం ప్రయాణంలో ఎదుర్కొంటున్న సమస్యలు చాలా వరకు తొలగిపోయాయి. ఇప్పటి వరకూ చెక్ ఇన్‌లో పంపినప్పుడల్లా ఇరుముడి దెబ్బతినడం, చీలిపోవడం, ఆలస్యం కావడం వంటి సమస్యలు తరచుగా ఎదురయ్యేవి.

Image

ఇప్పుడీ వెసులుబాటు రావడంతో భక్తులు ఆచారాలకు భంగం కలగకుండా ప్రయాణించగలుగుతున్నారు. శబరిమల సీజన్‌లో భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడం, దేశంలోని విభిన్న రాష్ట్రాల నుండి ప్రయాణించే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం చాలా సమయోచితమని యాత్రికులు అభిప్రాయపడుతున్నారు.

Image

ఈ సీజన్ మొత్తం శబరిమల యాత్రలో భక్తులకు మరింత సౌకర్యాలు అందించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు ఈ నిర్ణయం కొత్త ఉదాహరణగా నిలిచింది.

Also read: