Badrachalam : 9కి చేరిన ఎన్ కౌంటర్ మృతులు

Badrachalam : మహారాష్ట్ర,- నారాయణ పూర్ బార్డర్​లోని అబూజమడ్ దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మృతుల సంఖ్య 9కి చేరింది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. పోలీసులు,- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన తర్వాత కొందరు పారిపోయారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

ALSO READ :