భద్రాచలంలో(Bhadrachalam) ఆన్లైన్లో రాములోరి లగ్గం టికెట్స్ ఈనెల 17న జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవ వేడుకల టికెట్లు htts://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు సమాచార పౌర సంబంధాలు, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. రూ.7,500, 2 వేలు, వేయి, 300 వందల టికెట్లు భక్తులు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. సెక్టార్ లో చలువ పందిళ్లు ఏర్పాటుతో పాటు ఫ్యాన్స్, కూలర్స్, మంచినీరు, మజ్జిగ ఉచిత పంపిణీ తదితర ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Also read :
Kadiyam Srihari : మళ్లీ పోటీ చేయను
Shruthi Hassan : రజినీ సినిమాలో శృతి?

