Kejriwal: కేజ్రీవాల్ కు బెయిల్

kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Kejriwal) కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇంటీరియమ్ బెయిల్ పిటిషన్ ను ఇవాళ విచారణకు స్వీకరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం జూన్ ఒకటో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2వ తేదీన మళ్లీ లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేదీ వరకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ (Kejriwal)తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. ధర్మాసం నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో ఆయన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఊరట లభించినట్లయింది. లిక్కర్ కేసు గురించి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడొద్దని ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా ‘మీరు అంతకంటే గట్టిగ కౌంటర్ ఇవ్వండి’అని కోర్టు సూచించింది. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయన మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

Also read: