Bakhtiyarpur :ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత అదానీ గురించి నరేంద్ర మోదీని ఈడీ అడుగుతుందని..అప్పుడాయన పరమాత్మే తనను అడిగానని చెబుతాడని ఎద్దేవా చేశారు. నిరుద్యోగం విషయంలో పీఎం మోదీపై విరుచుకుపడిన రాహుల్.. సుదీర్ఘ ప్రసంగాలు చేసి దేశాన్ని విభజించడం మానేయండని.. ముందుగా బీహార్ ప్రజలకు, దేశంలోని యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండని మోదీని ప్రశ్నించారు. ఇవాళ బీహార్ పాట్నాలోని భక్తియార్‌పూర్‌లో(Bakhtiyarpur) జరిగిన ర్యాలీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్ గాంధీ పాల్గొన్నారు. నరేంద్ర మోదీ 22-25 మంది రాజా, మహారాజాలను తయారు చేశారని చెప్పారు. వారి కొత్త పేర్లు అదానీ అంబానీ అని చెప్పుకొచ్చారు. వారు రాజా, నరేంద్ర మోదీ కోసం కోసం 24 గంటలు పనిచేస్తారని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తానని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు.
ALSO READ :

