ప్రముఖ సంగీత విధ్వంజుడు గరిమెల అభినవ అన్నమయ్యగా కీర్తి నందు ఉన్న టిడిపి మస్థాన విధ్వంసుడు గరిమెల బాలకృష్ణ ప్రసాద్ (Balakrishna Prasad) 76 ఇక లేరు. తిరుపతి భవాని నగర్ లో నివాసం ఉంటున్న ఆయన ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ప్రముఖ సంగీత విధ్వంసుడిగా ప్రఖ్యాతిగాంచిన గరిమెల 600కు పైగా అన్నమయ్య కీర్తనలు స్వరప రిచి వెలుగులోకి తెచ్చారు.
6 వేలకు పైగా కచేరీలు చేశారు. ప్రత్యేకించి వినరో భాగ్యము విష్ణు కథ, పిడికిట తలంబ్రాల వెండికూతురు, జగడపు చనువుల జాతర, తిరువీధుల మెరిసి దేవదేవుడు, సందెకాడ పుట్టినట్టి చాయల పంట, ఇతడు ఒకడే సర్వేశ్వరుడు, నమో నారాయణ నమో వంటి కీర్తనలు ఆయన కు ఎంతో గుర్తింపు తెచ్చాయి సంప్రదాయ కర్నాటక సంగీతం తో పాటు లలిత సంగీతం, జానపద సంగీతం లోనూ ఆయన సుప్రసిద్ధులు.
సిలికానా ఆంధ్ర సంస్థ సికింద్రాబాద్ పరెడ్ మైదానంలో నిర్వహించిన లక్ష గళార్చనలో (Balakrishna Prasad) బాలకృష్ణ ప్రసాద్ ప్రధాన గాయకులు ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్ లో నమోదయింది. 1948లో రాజమండ్రిలో కృష్ణవేణి. నరసింహారావు దంపతులకు గరిమెల జన్మించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి ఈయనకు స్వయాన పిన్ని. మృదంగ విధ్వంసులైన తండ్రి నుంచి సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నారు. 1978 లో టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టులో గాయకుడిగా చేరిన ఆయన 2006 లో ఉద్యోగ విరమణ పొందారు. 2012 నుంచి 2023 వరకు టీటీడీ ఆస్థాన విధ్వంసుడిగా కొనసాగారు.
కామకోటి పీఠం, అహోబిల మఠం ఆస్థాన సంగీత విధ్వంసులుగా సేవలు అందించారు. తెలుగు నాట సంకీర్తన యజ్ఞ ప్రక్రియను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత గరిమెలకే దక్కుతుంది. 20 20 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు అపర అన్నమయ్య అన్నమాచార్య సంకీర్తన మహతి బిరుదులు స్వీకరించారు. ఈయనకు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతంలో గరిమెలకు ఎనలేని అనుబంధము ఉంది. ఈనెల 6న నిర్వహించిన యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు.
సింహ వాహన సేవలో పాల్గొన్నారు. ఇంతలోని ఆయన కన్నుమూశారని తెలియడంతో సంగీత ప్రియులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.
Also read:

