Balakrishna: నేను ఒరిజినల్… వాళ్లంతా గ్రీన్‌మ్యాట్

Balakrishna

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే ఒక ప్రత్యేక స్థానం గుర్తుకువస్తుంది. ఎన్టీఆర్ వారసుడిగా 1984లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన (Balakrishna) బాలయ్య, ఇటీవలే తన 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 65 సంవత్సరాల వయసులోనూ యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటుడిగా మాత్రమే కాదు. హిందూపురం ఎమ్మెల్యేగా. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా. ప్రజలకు సేవ చేస్తున్నారు. (Balakrishna) ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా ప్రకటించింది.

Image

ఇంతకీ, బాలకృష్ణ ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. చిరంజీవి, జగన్‌పై మాట్లాడిన మాటలు పెద్ద హైలైట్ అయ్యాయి. సినీ ఇండస్ట్రీలో తనను పట్టించుకోవడం లేదని చెప్పిన బాలయ్య వ్యాఖ్యలకు చిరంజీవి కూడా స్పందించారు. జగన్ కూడా విమర్శించారు. ఆ వివాదం కాస్త తగ్గుతుండగానే, ఇప్పుడు మరోసారి బాలయ్య వ్యాఖ్యలు హాట్‌టాపిక్ అయ్యాయి.

Image

ఇటీవల గోవాలో ప్రారంభమైన 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో బాలకృష్ణకు ప్రత్యేక సన్మానం నిర్వహించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ కలిసి బాలయ్యను శాలువా కప్పి సత్కరించారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ని ఘనంగా అభినందించారు.

Image

ఈ సన్మాన కార్యక్రమంలో బాలయ్య ప్రసంగించారు. అక్కడే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. చాలా చిన్న వాక్యాల్లో కానీ, చాలా కఠినంగా కానీ మాటలు చెప్పారు.

Image

“చిత్ర పరిశ్రమలో ఇప్పుడు టెక్నాలజీ ఆధిపత్యం ఎక్కువైంది” అని ఆయన మొదలుపెట్టారు.
“నేను 50 ఏళ్లు సినిమాల్లో ఉన్నాను. కేవలం ఎన్టీఆర్ కొడుకుగా మాత్రమే కాదు. నాకు సినిమాపై ఉన్న జ్ఞానం, వారసత్వమే నన్ను నిలబెట్టాయి” అని బాలయ్య అన్నారు.“ఇదే నాకు గర్వంగా ఉంటుంది” అని చెప్పారు.

Image

అయితే అసలైన బాంబ్ తర్వాత పేలింది.

“నేను ఒరిజినల్‌. కొందరు నటుల్లా గ్రీన్‌మ్యాట్, బ్లూ మ్యాట్ మీద నటించను” అని బాలయ్య వ్యాఖ్యానించారు.
“కొంతమంది హీరోలు సెట్‌లకు కూడా రారు. టెక్నాలజీతోనే మొత్తం పని పూర్తిచేస్తారు” అని అన్నారు.
“నా సినిమాలు నిజ జీవితానికి మించినవి. నా కథలు నాకు చాలా ముఖ్యం” అని వివరించారు.
“అవసరం ఉన్నప్పుడు టెక్నాలజీ వాడతాం. కానీ టెక్నాలజీ మీదే ఆధారపడే వాళ్లను నేను హీరోలుగా భావించను” అని స్పష్టం చేశారు. “నేను ఒరిజినల్. డూప్లికేట్ కాదు” అని పదే పదే చెప్పారు.

ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది.కొంతమంది హీరోల అభిమానులు బాలయ్యపై ట్రోలింగ్ చేస్తున్నారు.కొంతమంది ఈ వ్యాఖ్యలను unnecessary అని అంటున్నారు.మరికొందరు బాలయ్య స్టైల్ ఇదే అని సమర్థిస్తున్నారు.

Image

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లాంటి హిట్స్ తర్వాత బాలయ్య ఇప్పుడు అఖండ 2తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.డిసెంబర్ 5న సినిమా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి.

Also read: