టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) వరుస విజయాలతో బిజీగా కొనసాగుతున్నాడు. ఇటీవల విడుదలైన “డాకు మహారాజ్” సినిమాతో ప్రేక్షకులను అలరించిన (Balakrishna) బాలయ్య, ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న “అఖండ 2” చిత్రంలో నటిస్తున్నాడు.
‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి అఘోర పాత్రగా ఉంటే, రెండో పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం బాలయ్య తన నిజజీవితంలో ఉన్నట్టే — హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలయ్య సినిమాలోనూ అదే పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలు వినగానే బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “మన లీడర్ రియల్ లైఫ్ రోల్‌లో రీల్‌లో చూడబోతున్నాం!” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also read:

