Balmuri Venkat Ghatu: కేటీఆర్..​ మతి తప్పి మాట్లాడుతున్నవ్​

కేటీఆర్‌కి మతి తప్పిందా? — ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాటు(Balmuri Venkat Ghatu) విమర్శలు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై తండ్రీకొడుకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, నిజంగా ధైర్యం ఉంటే లై డిటెక్టర్ టెస్టు చేయించుకోవాలని సవాల్ విసిరారు.

గాంధీభవన్‌లో మీడియాతో ఘాటుగా

బల్మూరి ఇవాళ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ:
“కేదార్‌కి మాకేమీ సంబంధం లేదంటున్నారు. అయితే మీ బామ్మర్ది పాకాల ఎందుకు కేదార్ కార్ వాడాడు? మీ కుటుంబ ఫంక్షన్లను కేదార్‌ ఎందుకు నిర్వహించాడు?” అని ప్రశ్నించారు.(Balmuri Venkat Ghatu)

డ్రగ్స్ టెస్ట్ పై ప్రశ్నలు

“డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని సవాల్ విసిరితే కోర్టుకెళ్లారు. కోర్టు తీర్పును వక్రీకరించారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత బ్లడ్ శాంపిల్ ఇస్తానంటున్నారు. ఎప్పుడు అమెరికాకు వెళ్లారు? 3 నెలలు అక్కడ డ్రగ్ డిటాక్స్ చేసుకున్నారా?” అని విసిరారు ప్రశ్నలు.

సీఎం స్పందించాలని డిమాండ్.

“కేదార్‌తో ఎలాంటి సంబంధాలు లేవంటున్నారు. అయితే నిజంగా స్పష్టత కావాలంటే సీఎం అన్వేషణకు లేఖ రాయాలి” అని డిమాండ్ చేశారు.
అలాగే, ఇకపై కేటీఆర్ ప్రవర్తనను బట్టే తమ ప్రవర్తన ఉంటుంది అని హెచ్చరించారు.

Also Read :