Banakacherla: మేం రాం

బనకచర్లపై(Banakacherla) చర్చించేందుకు తాము రాబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ పై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బనకచర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. బనకచర్ల(Banakacherla) ప్రాజెక్టు ప్రతిపాదనలు, తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 16న (రేపు) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ ఇరు రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ సమావేశానికి రావడానికి వీలవుతుందో లేదో చెప్పాలని లేఖలో పేర్కొంది. కేంద్ర మంత్రి లేఖపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అందులో ఇప్పటికే బనకచర్లపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Also Read :