ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi) బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. సీఎం హామీలు అమలు కాలేదంటే.. ముఖ్యమంత్రి పదవికే కళంకం అని అన్నారు(Bandi) . ‘రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా, మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే రైతు భరోసాకు ఎంపిక చేయడమేంది? అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే.. నేటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయకపోవడం బాధాకరం.
10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికీ 9.80 లక్షల మందికి పైసలు వేయకపోవడమేంటి? 40 లక్షల కొత్త రేషన్ కార్డులిస్తామని 42, 267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదం. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ, నేటికీ ఒక్కరంటే ఒక్కరికీ ఇంటిని నిర్మించకపోవడం సిగ్గుచేటు. సీఎం హామీలనే అమలు చేయలేకపోతే, మీ ఆధ్వర్యంలో పనిచేసే అధికారులు ఏ విధంగా జవాబుదారీతనంతో పనిచేయగలరు? దేశం దృష్టిలో తెలంగాణ సమాజాన్ని పలుచన చేయడమే. ప్రజలందరికీ తెలిసేలా రేషన్ షాపుల వద్ద, రేషన్ కార్డులపై పీఎం ఫొటోను ఉంచాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మంజూరయ్యే ఇండ్లకు ఆ పేరును యధాతథంగా కొనసాగించాలి. లేనిపక్షంలో ప్రజా తిరుగుబాటు తప్పదు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని లేఖలో హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. సీఎం హామీలు అమలు కాలేదంటే.. ముఖ్యమంత్రి పదవికే కళంకం అని అన్నారు. ‘రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా, మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే రైతు భరోసాకు ఎంపిక చేయడమేంది? అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే.. నేటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయకపోవడం బాధాకరం.10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికీ 9.80 లక్షల మందికి పైసలు వేయకపోవడమేంటి? 40 లక్షల కొత్త రేషన్ కార్డులిస్తామని 42, 267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదం. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ, నేటికీ ఒక్కరంటే ఒక్కరికీ ఇంటిని నిర్మించకపోవడం సిగ్గుచేటు. సీఎం హామీలనే అమలు చేయలేకపోతే, మీ ఆధ్వర్యంలో పనిచేసే అధికారులు ఏ విధంగా జవాబుదారీతనంతో పనిచేయగలరు? దేశం దృష్టిలో తెలంగాణ సమాజాన్ని పలుచన చేయడమే. ప్రజలందరికీ తెలిసేలా రేషన్ షాపుల వద్ద, రేషన్ కార్డులపై పీఎం ఫొటోను ఉంచాలి.
Also read :
Medak district: ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

