ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్యాంకు ఖాతాలో ఎన్ని డబ్బులున్నాయో చెప్పేశారు కరీంనగర్ ఎంపీ బండి (Bandi) సంజయ్. ఇవాళ వేములవాడలో ప్రధాన మంత్రి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని కోడె మొక్కును తీర్చుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన సభలో బండి(Bandi) సంజయ్ మాట్లాడుతూ.. ‘మోదీకి కుట్రలు , కుతంత్రాలు తెలియవు.. కేవలం ఐదు లక్షల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే ఉంది.. పదవి వద్దనుకుంటే జబ్బకు సంచి వేసుకొని బయటికి వచ్చేరకం .. కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన మొనగాడు నరేంద్ర మోదీ.. 370 ఆర్టికల్ ను రద్దు చేసిన మొనగాడు మోదీ.. సోనియా మైనో.. రాహుల్ గాందీ.. రాహుల్ విటీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు.. కాంగ్రెస్ బ్రిటీష్ కు సంబంధించిన పార్టీ.. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశానికి సంబంధించిన పార్టీ’అని అన్నారు.
Also read:

