Bandi Sanjay: చెన్నైలో దొంగల ముఠా సమావేశం

Bandi Sanjay

చెన్నైలో జరిగేది దొంగల ముఠా సమావేశమని, ప్రజల దారి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ​ఫైర్​అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యానని. 6 గ్యారెంటీలపై పోరాడకుండా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. కరీంనగర్ లో (Bandi Sanjay)  సంజయ్​మాట్లాడుతూ ‘కేసీఆర్ కుటుంబ అవినీతి కేసులను కాంగ్రెస్ నీరుగారుస్తోంది. లిక్కర్ దొంగలంతా ఒక్కటయ్యారు. చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదు.. చంబల్ లోయ ముఠా సమావేశం. దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కాంల నుంచి బయటపడే దానిపైనే ఈ మీటింగ్. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదు. అసలు ఇంతవరకు గైడ్ లైన్స్ వెలువడనే లేదు. ఆలు లేదు.. చూలు లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ప్రతిపక్షాల తీరుంది. డీఎంకే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాంకు పాల్పడింది. అనేక అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారు’ అని తెలిపారు.

Image

ప్రగల్భాలు పలికి ఫాంహౌజ్ లో గడ్డి పీకుతుండు
‘నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను. నాకు కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించారు. మీడియా, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దు. జాతీయ నాయకత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడమే క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తల పని. గతంతో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. కార్యకర్తలతో కలిసి అనేక పోరాటాలు చేశాను. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉంది
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఫాంహౌజ్ లో గడ్డి పీకుతున్నాడు. ఆయన మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఇక కల్ల’ అని సంజయ్​అన్నారు.

Also read: