BCCI: ఆసియా కప్‌ బాయ్​కాట్?

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ)(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్‌ను బాయ్​కాట్​చేయాలని డిసైడ్​అయ్యినట్లు సమాచారం. పాకిస్తాన్‌ మంత్రి నేతృత్వం వహిస్తున్న ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఆధ్వర్యంలో జరిగే ఏ ఈవెంట్లలో భారత క్రికెట్‌ జట్లు (పురుషులు, మహిళలు) పాల్గొనవని పేర్కొంది. ఈ విషయాన్ని ఏసీసీకి కూడా తెలియజేసిందని టాక్. క్రికెట్‌కు సంబంధించి పాక్‌ను ఒంటరి చేయడమే లక్ష్యంగా ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై బోర్డు(BCCI) నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Also Read :