(T20 World Cup) టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికపై బీసీసీఐ గట్టిగా కసరత్తు చేస్తోంది.ప్రతి ఆటగాడి ఫామ్‌ను నిశితంగా పరిశీలిస్తోంది.ఈ క్రమంలో భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్ పెద్ద చర్చకు దారితీస్తోంది.గిల్ ప్రతిభపై ఎవరికీ సందేహం లేదు.(T20 World Cup) కానీ ఇటీవల అతని ప్రదర్శన అంచనాలకు తగ్గట్టుగా లేదు.ఇదే సెలెక్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.నేషనల్ మీడియా కథనాల ప్రకారంగిల్ను తుది 15 మంది జట్టులోంచి తప్పించే అవకాశం తక్కువే.అయితే అతని పాత్రపై కీలక చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా గిల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగాలా?లేదా ఆ బాధ్యతను మరొకరికి అప్పగించాలా?అనే ప్రశ్న సెలెక్షన్ కమిటీ ముందు ఉంది.సెప్టెంబర్ నుంచి గిల్ ఆసియా కప్‌తో పాటుఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో పాల్గొన్నాడు.కానీ ఆ మ్యాచ్‌ల్లో అతని అత్యధిక స్కోర్ కేవలం 47 మాత్రమే.
టీ20 ఫార్మాట్‌కు ఇది సరిపోదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రత్యేకంగా పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రాబట్టాల్సిన అవసరం ఉంది.ఈ విషయంలో గిల్ కొంత నెమ్మదిగా ఆడుతున్నాడన్న విమర్శలు ఉన్నాయి.గిల్ ఓపెనర్‌గా కొనసాగితేసంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు వెళ్లాల్సి వస్తోంది.ఇది జట్టు సమతుల్యతపై ప్రభావం చూపుతుందన్న చర్చ సాగుతోంది.
మరోవైపు యశస్వి జైస్వాల్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.యువ బ్యాటర్‌గా అతను దూకుడుగా ఆడతాడు.పవర్‌ప్లేలోనే మ్యాచ్‌పై పట్టు సాధించే సామర్థ్యం ఉంది.అబిషేక్ శర్మ తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడుతున్నాడు.
కానీ గిల్ నెమ్మదిగా ఆడితేఅబిషేక్పై ఒత్తిడి పెరుగుతోందని సెలెక్టర్లు భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లోయశస్వి జైస్వాల్ లేదా ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా తీసుకుంటేయువ ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇషాన్ కిషన్ కూడా ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు.లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం జట్టుకు అదనపు లాభం.అందుకే అతని పేరును కూడా పరిశీలిస్తున్నారు.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ వరకుబీసీసీఐకి జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.పిచ్‌లు, పరిస్థితుల్ని బట్టి తుది నిర్ణయం తీసుకోనుంది.గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలోదుబాయ్ పిచ్‌లను దృష్టిలో పెట్టుకుని
యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయాలే ఇప్పుడు కూడా తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగాసూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భారత గడ్డపై జరిగే ఈ టీ20 వరల్డ్ కప్సూర్యకు చివరి గ్లోబల్ ఈవెంట్ కావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.ఇప్పటికే 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్య
గత ఏడాది కాలంగా నిలకడగా రాణించలేకపోయాడు.సుమారు 14 నెలల్లో 24 మ్యాచ్‌లు ఆడినాఅంచనాలకు తగ్గ ప్రదర్శన కనిపించలేదు.
కెప్టెన్ కావడం వల్లేఅతను జట్టులో కొనసాగుతున్నాడన్న విశ్లేషణ కూడా జరుగుతోంది.వరల్డ్ కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో ఆడే టీ20 సిరీస్సెలెక్టర్లకు కీలక సూచన ఇవ్వనుంది.ఆ సిరీస్‌లో ఆటగాళ్ల ఫామ్‌పై స్పష్టత రానుంది.
ప్రస్తుతం జట్టులో కొత్తగా ఖాళీలు లేకపోయినాగిల్ స్థానం పదేపదే సమీక్షకు వస్తోంది.యశస్వి జైస్వాల్ బెంచ్‌పై వేచి చూస్తున్నాడు.న్యూజిలాండ్ సిరీస్కుజైస్వాల్ను అదనపు ఆటగాడిగా తీసుకునిఅవసరమైతే వరల్డ్ కప్‌లో వినియోగించాలన్న ఆలోచనపై కూడాసెలెక్టర్లు దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
మొత్తంగాటీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికబీసీసీఐకి పెద్ద సవాలుగా మారింది.రాబోయే నెలలు భారత జట్టుకు కీలకంగా ఉండనున్నాయి.
Also read:

