Bengal: ట్రైన్ ఆక్సిడెంట్

Bengal

పశ్చిమ బెంగాల్‌(Bengal)లోని సిలిగురి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 15మంది మృతి చెందారు. 60 మంది వరకు గాయపడ్డారు. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ (13174)ని వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది.(Bengal) ఈ ప్రమాదంలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు కోచ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Image

గాల్లోకి ఎగిరిన బోగీ
త్రిపుర రాజధాని అగర్తల నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సీల్దాకు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. రెడ్ సిగ్నల్ కారణంగా సిలిగురిలోని రంగపాణి స్టేషన్ సమీపంలోని రుయిదాసా వద్ద ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. ఇంతలో వెనుక నుంచి అదే ట్రాక్ పై వచ్చిన గూడ్స్ రైలు.. కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ఒక బోగీలు గాల్లోకి ఎగిరాయి. మరో రెండు కోచ్ లు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలు బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ సిగ్నల్ పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

Image

ఈశాన్య భారతానికి నిలిచిన రైళ్లు
డార్జిలింగ్ వెళ్లేందుకు విరివిగా ప్రయాణీకులు కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ను ఆశ్రయిస్తారు. ఈ రైలు మార్గాన్ని చికెన్ నెక్ కారిడార్ అంటారు. కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ బెంగాల్‌ను ఈశాన్య నగరాలైన సిల్చార్, అగర్తలాతో కలుపుతుంది. ఇది ఈశాన్య ప్రాంతాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. ప్రమాదం కారణంగా పలు రైళ్లు నిలిచిపోయాయి.

Image

దీదీ దిగ్భ్రాంతి
ఘోర రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించారని మమత పేర్కొన్నారు. ప్రమాద స్థలికి సీఎం మమత బెనర్జీ వెళ్తున్నారు.

Image

రైల్వే హెల్ప్‌లైన్ నంబర్స్
సీల్దాలో..
033-23508794
033-23833326

గౌహతిలో
03612731621
03612731622
03612731623

లాండింగ్ జంక్షన్
03674263958
03674263831
03674263120
03674263126
03674263858
పెరుగుతున్న మృతులు
కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 15 మంది మరణించినట్టు రైల్వే అధికారులు ధ్రువీకరించారు. 60 మంది వరకు గాయపడ్డట్టు తెలిపారు. అయితే పశ్చిమ బెంగాల్ పోలీసులు మాత్రం ఐదుగురు చనిపోయినట్టు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదం దురదృష్టకరం
కాంచన్ జంగా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఎన్ ఎఫ్ ఆర్ జోన్ లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్​, ఎస్డీ ఆర్ఎఫ్​ టీమ్స్ సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారని, ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు. తమ ఆప్తులు కోల్పోయిన వారికి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.