(Bengaluru) బెంగళూరును కుదిపేసిన 7.11 కోట్ల భారీ దోపిడీ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. పట్టపగలే క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వాహనాన్ని ఆపి, ఆదాయపు పన్ను అధికారులమని నటించి నగదు దోచుకెళ్లిన ముఠా దాగుడు మూతలు ముగిశాయి. మూడు నెలల పాటు రహస్యంగా ప్లాన్ చేసిన ఈ దోపిడీని (Bengaluru) బెంగళూరు పోలీసులు కేవలం 72 గంటల్లో ఛేదించడమే కాకుండా, ఈ కేసులో ఒక షాకింగ్ నిజాన్ని బయటకు తీశారు — దొంగలకు దొంగతనం ఎలా చేయాలో పాఠాలు నేర్పింది ఒక పోలీస్ కానిస్టేబుల్.
ఎలా జరిగింది దోపిడీ?
నవంబర్ 19.
బెంగళూరులో ఏటీఎంలకు పెద్ద మొత్తంలో నగదు తరలించేందుకు క్యాష్ వ్యాన్ బయలుదేరింది. ఈ విషయం ఇప్పటికే ముఠాకు తెలిసిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ స్టిక్కర్ ఉన్న వాహనంతో ముఠా వ్యాన్‌ను ఆపింది.
“మేము ఆదాయపు పన్ను అధికారులు” అని చెప్పి సిబ్బందిని బెదిరించారు.
ఎవరూ అనుమానం పడకముందే వ్యాన్‌లోని 7.11 కోట్ల నగదును తమ కారులో ఎక్కించి పరారయ్యారు.
ఈ సంఘటన పట్టపగలే జరగడం… దోపిడీ మొత్తం 7.11 కోట్లు ఉండటం… ప్రభుత్వం సంబంధమున్నట్లు చూపించడం… ఇవన్నీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
72 గంటల్లో కేసు ఛేదన
బెంగళూరులోని CCB, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది మొత్తం 200 మంది అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు.
తక్షణమే ఫోన్ డేటా, సీసీటీవీ వీడియోలు, టోల్ గేట్ రికార్డులు పరిశీలించారు.
పోలీసులు కేరళ, తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.
అంతలోనే బెంగళూరుకు చెందిన ముగ్గురు నిందితులు—
కానిస్టేబుల్ అప్పన్న నాయక్, జేవియర్, గోపాల్ ప్రసాద్—పోలీసుల వలలో పడ్డారు.
వారి వద్ద నుంచి ₹5.76 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ముగ్గురిని హైదరాబాద్‌లోని ఒక లాడ్జ్‌లో అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి ₹53 లక్షలు రికవర్ చేశారు.
ఇంతవరకు మొత్తం తిరిగి వచ్చిన డబ్బు: ₹6.29 కోట్లు
మిస్సింగ్ అమౌంట్: ₹82 లక్షలు
దొంగలకు ట్రైనింగ్ ఇచ్చిన పోలీస్!
ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయం పోలీసులు వెల్లడించారు:
దొంగలకు దొంగతనం ఎలా చేయాలో నేర్పింది కానిస్టేబుల్ అప్పన్న నాయక్.
అంటే—
▪️ ఏ ప్రదేశంలో సీసీటీవీలు లేవో
▪️ పోలీసులను ఎలా తప్పుదారి పట్టించాలో
▪️ ఎక్కడ వాహనాలను మార్చాలో
▪️ ఏ భాషలో వాట్సాప్ కాల్స్ మాట్లాడితే ట్రేస్ అవ్వవో
▪️ నకిలీ నంబర్ ప్లేట్లు ఎలా వాడాలో
ఇవన్నీ అతడే ట్రైనింగ్ ఇచ్చినట్లు విచారణలో బయటపడింది.
సీఎంఎస్ సంస్థ మాజీ ఉద్యోగి కీలక పాత్ర
సీఎంఎస్ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ మాజీ ఉద్యోగి జేవియర్ డబ్బు తరలింపు సమయాలను ముఠాకు తెలిపాడు.
ఎప్పుడు ఎక్కువ డబ్బు ఉంటుందో… ఏ మార్గంలో వెళ్తారో… అన్ని వివరాలు అందించాడు.
జేవియర్ స్వయంగా డబ్బు ఉన్న వాహనాన్ని నడిపి ముఠాకు అందించాడు.
పోలీసుల చర్యలు
▪️ చిత్తూరు జిల్లాలో దొంగలు వాడిన వాహనం లభించింది.
▪️ మరో ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
▪️ నగదు రవాణాలో నిర్లక్ష్యం కారణంగా సీఎంఎస్ సంస్థపై చర్యలు తీసుకునేందుకు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ సూచించారు.
▪️ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన 200 మంది పోలీసులకు ₹5 లక్షల బహుమతి ప్రకటించారు.
Also read:

