BHATTI VIKRAMARKA: ‘భట్టి’కి సెగ.. నిజమేనా?

BHATTI

కొత్త వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(BHATTI VIKRAMARKA)కు సీఎం రేవంత్ చెక్ పెడుతున్నారట. హైదరాబాద్ మహానగరంలో వెలిసిన హోర్డింగులు, బస్టాప్ లలో ఉండే లాలీపప్స్, ప్రధానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన కటౌట్స్, పత్రికలు, టీవీలకు ఇచ్చిన యాడ్స్ లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(BHATTI VIKRAMARKA) ఫొటో గాయబ్ కావడం.  మొన్నటి వరకు ఎక్కడికి వెళ్తే అక్కడికి భట్టిని వెంటేసుకుపోయిన సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రధాని సభకు ఆయనను తీసుకు వెళ్లలేదు. ప్రధానికి స్వాగతం పలికే సమయంలోగానీ, వీడ్కోలు చెప్పిన సందర్భంలోగానీ వెంట డిప్యూటీ సీఎం లేరు. సంగారెడ్డికి సీఎం వెళ్లలేదు. కనీసం అక్కడికి భట్టి విక్రమార్కను పంపలేదు. సంగారెడ్డి మీటింగ్ కు ప్రభుత్వం పక్షాన రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దేవాదాయ మంత్రి కొండా సురేఖను పంపారు. మధ్యాహ్నం పర్యటన ముగించుకొని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. పక్కన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రమే ఉన్నారు. భట్టి విక్రమార్క ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ గ్యాప్ దేనికి సంకేతం..? ఎందుకు భట్టిని పక్కన పెడుతున్నారు. ఇవాళ రైతులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడనున్నట్టు సీఎం పత్రికలు, టీవీలకు ప్రకటనలు ఇచ్చారు. అందులో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫొటో మాత్రమే ఉంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోగానీ, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫొటోకానీ లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. హోర్డింగులు, ప్రకటనల నుంచి ఆయన పేరు ఎందుకు తొలగించారు అన్నది చర్చనీయాంశంగా మారింది.అయితే రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. హోర్డింగుల నుంచి భట్టి ఫొటోను ఎందుకు తీసేస్తున్నట్టు..? లోక్ సభ ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఇటు ప్రజలకు అటు పార్టీ కార్యకర్తలకు రాంగ్ ఇండికేషన్స్ ఇస్తాయనే ఆందోళన కూడా పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.  ఈ ఇద్దరి వ్యవహారంపై మీడియాలో కథనాలు వెలువడుతున్నా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గానీ స్పందించకపోవడం గమనార్హం. వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించేంత వరకు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. 

Also  Read

TOOPRAN:కేసీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్​కు షాక్​

Nivedha Pethuraj: తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం