భిక్కనూరు(Bhiknur): చారిత్రక ప్రాధాన్యం పౌరాణిక గాధ కలిగిన సిద్ధరామేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన ముత్యాల పందిట్లో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేబు చేయించి.. అర్చకులు కొడకండ్ల సిద్ధగిరి శర్మ,కొడకండ్ల రామగిరి శర్మ, న్యాలకంటి రాజేశ్వర్ శర్మ, కుప్పా జగన్నాథ శర్మ, గోపికృష్ణ శర్మ , సాయి, నిఖిల్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణ క్రతువును నిర్వహించారు.

ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్ కళ్యాణోత్సవానికి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గంగ, భువనేశ్వరి సమేత శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి కల్యాణం జరిగినంత సేపు భక్తులు శ్రద్ధగా వీక్షించి.. పంచాక్షరి మంత్రాన్ని పఠించారు. ఆదిదంపతుల కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. సిద్ధ రామేశ్వరుడు మూడు ముళ్ళు వేసే క్రతువును చూసి తరించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రెండు గంటల పాటు మండపంలోనే ఉండి కల్యాణోత్సవం తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి పీఠాధిపతి సదాశివ మహంతు, ఎంపీపీ గాల్ రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ పెద్ద బచ్చ గారి నరసింహారెడ్డి , సర్పంచ్ తునికి వేణు, డిసిసిబి డైరెక్టర్ లింగాల కిష్టాగౌడ్, కామారెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంత్ రెడ్డి, జెడ్పిటిసి సభ్యురాలు పద్మ, ఆర్ బి ఎస్ చైర్మన్ రామచంద్రం ఆలయ ఈవో పద్మ శ్రీధర్ ఉప సర్పంచ్ నరేష్, పునర్నిర్మాణ కమిటీ డైరెక్టర్లు వెంకమ్మ గారి బసవయ్య, శ్రీనివాసరెడ్డి, తాటిపల్లి శ్రీనివాస్ గుప్తా, బాలకిషన్,సిద్ధారెడ్డి, తాటికొండ బాబు, పోచమైన రాజయ్య, నిట్టూరి నిర్మల, సరస్వతి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒడిబియ్యం పోసేందుకు సమయం పట్టింది.చాలామంది క్యూలో నిల్చొని స్వామి అమ్మవార్లకు ఒడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.కల్యాణోత్సవం అనంతరం భక్తులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించారు.
ఘనంగా అగ్నిగుండాలు
సోమవారం తెల్లవారుజామున జరిగిన వీరభద్ర ప్రస్తావన అగ్నిగుండాలను తిలకించేందుకు భక్తులు ఒకరోజు ముందే ఆలయానికి చేరుకున్నారు వీరశైవ సమాజం వారి దండకాలు ఆలయ అర్చకుడు ప్రభు సిద్దేశ్ మంత్రోచ్చారణల మధ్య ఈ దక్షయజ్ఞం కార్యక్రమం కొనసాగింది.వీరభద్ర ఆలయం వద్ద ఏర్పాటుచేసిన అగ్నిగుండాల్లో భక్తులు నిప్పు కణికలపై నడిచి తమ కష్టాలు తీర్చాలని సర్వేశ్వరుడిని వేడుకున్నారు. ఆ తర్వాత ఆలయ మూలవిరాట్ కు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం మాతా భువనేశ్వరి దేవికి కుంకుమార్చనలు నిర్వహించారు.
రాత్రికి స్వామి వారి విమాన రథోత్సవం
సిద్దరామేశ్వర స్వామిబ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి దాటాక స్వామి, అమ్మవార్ల విమాన రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం స్వామి వారి రథాన్ని అందంగా పూలతో ముస్తాబు చేశారు. ఆలయ మహంతు సదాశివ రుద్రకారుడై సిద్ధగిరి రామగిరి యోగి పుంగవుల సమాధి మందిరం నుంచి పరిగెత్తుకొని వచ్చే సన్నివేశాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు.
Also Read
Bhiknur : ఘనంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు
siddarameshwara : 11 నుంచి సిద్ధరామేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

