Bhiknur : ఘనంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు

sidda rameshwara swamy alayam

భిక్కనూరు(Bhiknur) సిద్ధ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన ఆదివారం విశేష పూజలు అర్చనలు హోమాలు నిర్వహించారు ఆలయ అర్చకులు సిద్ధగిరి శర్మ రామగిరి శర్మ రాజేశ్వర్ శర్మ సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి అగ్ని ప్రతిష్ట హోమము, ధ్వజారోహణము, బలిహరణము నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేళ అలంకరించిన బండ్లతో సిద్ధ రామేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షణ చేయించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి పాలకమండలి సభ్యులు కార్య నిర్వహణ అధికారి ఎండోమెంట్ అధికారులు గ్రామ పెద్దలు పర్యవేక్షించారు.

sidda rameshwara swamy alayam
ఎడ్ల బండ్ల ఊరేగింపు

సిద్ధ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి 11 గంటలకు వీరభద్ర ప్రస్తావన.. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అగ్నిగుండాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాల కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అందె మహేందర్ రెడ్డి వివరించారు. సోమవారం ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నారు సదాశివ మహంతు ఉదయం 11 గంటల ప్రాంతంలో సిద్ధ రామేశ్వరాలయం నుంచి కుమ్మరి గల్లీలోని సిద్ధగిరి రామగిరి యోగి పుంగవుల సమాధి ఆలయం వద్దకు వేంచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భాజా భజంత్రీల మధ్య పుస్తె మట్టెలు తీసుకొని సిద్ధ రామేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేకంగా వేసిన చలువ పందిళ్లలో ఏర్పాటుచేసిన ముత్యాల పందిరిలో గంగా భువనేశ్వరి సమేత సిద్ధ రామేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా.. కనుల పండువగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి కల్యాణోత్సవానికి ముత్యాల పందిరి పూల అలంకరణ దాతలుగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన తాటిపల్లి పద్మ శ్రీనివాస్ గుప్తా దంపతులు ఉన్నారు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవ వస్త్రాల దాతలుగా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన మాదంశెట్టి పద్మజ ఆంజనేయులు ఉన్నారు. కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు ప్రత్యేకంగా అన్నదానం ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

also read :