అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden) తీరు ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు. దారితప్పడం, గందగరోళ చూపులు, స్టేజీపై ఆగిపోవడం లాంటి ఘటనలే ఇందుకు ఉదాహరణ. తాజాగా మరోసారి అదే తరహా ఘటన జరగగా..అక్కడే ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయనకు సాయంగా నిలిచారు. లాస్ ఏంజిల్స్‌లో డెమోక్రాటిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో బైడెన్, ఒబామా కలిసి పాల్గొన్నారు. వారిద్దరినీ జిమ్మీ కిమ్మెల్ దాదాపు 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు. అనంతరం మద్దతుదారులు కరతాళ ధ్వనులతో హాల్‌ను మార్మోగించారు. దీంతో ఇరువురు నేతలు వారికి అభివాదం చేశారు. అనంతరం ఒబామా స్టేజీ దిగి వెళుతున్నారు… బైడెన్(Biden) మాత్రం ఎటూ పాలుపోనట్లు ఓ పది సెకన్ల పాటు ఉన్నచోటే బిగుసుకుపోయినట్లు నిలబడిపోయారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా.. బైడెన్‌ను చేయి పట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ALSO READ :

