Bihar: బీహార్ ఎన్నికలే లక్ష్యం

Bihar

ఢిల్లీ ఎన్డీఏ ప్రభుత్వం బీహార్  (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్టు కనిపిస్తోంది. బీహార్ లో అధికంగా పండించే మఖానా కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం విశేషం. కంది, మినుములు, మసూర్ (ఎర్రపప్పు) కొనుగోలు చేయనుంది. దీంతో పాటు పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. అధిక ఉత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్ ఏర్పాటు చేయనుంది. పత్తి ఉత్పత్తి పెంపు కో సం జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసి దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘బీహార్‌లో (Bihar) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తాం, ఇది తూర్పు భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహిస్తుంది. యువతకు ఉపాధి కల్పించేందుకు ఇది ఉపకరిస్తుంది’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Image

ఢిల్లీ ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్టు కనిపిస్తోంది. బీహార్ లో అధికంగా పండించే మఖానా కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం విశేషం. కంది, మినుములు, మసూర్ (ఎర్రపప్పు) కొనుగోలు చేయనుంది. దీంతో పాటు పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. అధిక ఉత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్ ఏర్పాటు చేయనుంది. పత్తి ఉత్పత్తి పెంపు కో సం జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసి దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తాం, ఇది తూర్పు భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహిస్తుంది. యువతకు ఉపాధి కల్పించేందుకు ఇది ఉపకరిస్తుంది’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Image

Also read: