BJP: మహాయుతిదే ముంబై.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు

BJP

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా (BJP) భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో దూకుడు చూపిస్తోంది. డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేతో జతకట్టిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ముందంజలో కొనసాగుతోంది.ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ ప్రభంజనం కనిపిస్తోంది. మొత్తం 227 వార్డు స్థానాలకు గాను బీజేపీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ముంబై రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. మున్సిపల్ పాలనపై పట్టు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం (ఎస్‌ఎస్ యూబీటీ) 60 వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. షిండే వర్గానికి చెందిన శివసేన 26 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉండగా, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఐదు చోట్ల ముందుంది. ఇతర పార్టీలు మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Image

ఈ ఫలితాలు చూస్తే మహాయుతి కూటమికి ప్రజల మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ–శివసేన (షిండే వర్గం) కూటమి నగర రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ముంబై వంటి ఆర్థిక రాజధానిలో బీజేపీ ముందంజలో ఉండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా మహాయుతి కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశాయి. ప్రజల్లో ఉన్న అసంతృప్తి, అభివృద్ధి అంశాలు ఈ ఫలితాల్లో ప్రతిఫలించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ముంబై మున్సిపాల్టీలో సుమారు 52 శాతం పోలింగ్ నమోదైంది. ఇది నగర ఓటర్లలో మోస్తరు ఉత్సాహాన్ని సూచిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం సాధారణంగా తక్కువగా ఉండే పరిస్థితుల్లో ఇది గణనీయమైన సంఖ్యగా చెప్పవచ్చు.

ఈ ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో శాంభాజీనగర్, నవీ ముంబై, వాసాయి విరార్, కల్యాణ్ డోంబివిలీ, కోల్హాపూర్, నాగపూర్, సోలాపూర్, అమరావతి, అకోలా, నాషిక్, పింప్రి చించవాడ్, పుణె, ఉల్లాస్‌నగర్, థానే, చంద్రాపూర్, పర్బణీ, మీరా భయాందర్, నాందేడ్, వాగాలా, పాన్వేల్, భీవండి-నిజాంపూర్, లాతూర్, మలేగావ్, సంగ్లీ-మిరాజ్-కుప్వాడ్, జల్గావ్, అహల్యనగర్, దూలే, జాల్నా, ఇచల్‌కరంజి ఉన్నాయి.ఈ పట్టణాలన్నింటిలోనూ మహాయుతి కూటమి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పరిపాలన అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయని విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫలితాలు కీలక మార్పులకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also read: