తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో (BJP) భారతీయ జనతా పార్టీతన బలాన్ని స్పష్టంగా చాటిందనిబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు.రాష్ట్రంలో జరిగిన తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లోవెయ్యికిపైగా సర్పంచ్ స్థానాల్లో (BJP) బీజేపీ ఘన విజయం సాధించిందనిఆయన వెల్లడించారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూఈ ఎన్నికలు బీజేపీకి కీలక మైలురాయిగా మారాయని చెప్పారు.
అధికార పార్టీభయపెట్టే ప్రయత్నాలు చేసినాబీజేపీ తరఫున గెలిచిన సర్పంచులెవరూ పార్టీని వీడలేదని స్పష్టం చేశారు.ఇది ప్రజల్లో బీజేపీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.సర్పంచ్ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా
812 వందలకు పైగా ఉపసర్పంచ్ స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు.
అదే విధంగా 10 వేలకుపైగా వార్డుల్లో బీజేపీ గెలుపొందిందని వివరించారు. ఈ ఫలితాలు గ్రామీణ తెలంగాణలో
బీజేపీ బలంగా పాతుకుపోయిందనినిరూపిస్తున్నాయని అన్నారు.ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో
బీజేపీకి పట్టుందా అనే సందేహాలకు ఈ ఎన్నికల ఫలితాలే సమాధానమని చెప్పారు.
తెలంగాణలో ప్రస్తుత అధికార పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని
రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కారు అంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఇది ఇంకా ఆరంభమేనని చెప్పారు.
రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభావం మరింత పెరుగుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ తరఫున గెలుపొందిన
అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తమ పార్టీ అభ్యర్థులను ఆదరించిన ప్రజలకు పేరు పేరునా
ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే
ముఖ్య కారణమని అన్నారు. మోదీ పాలనతో ప్రభావితమై అనేక మంది బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.
ఈ క్రమంలో ప్రముఖ సినీ హీరోయిన్ ఆమని మరియు మేకప్ ఆర్టిస్ట్ శోభలత బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వారి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని అన్నారు.రాబోయే ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలుకుతున్నాయని బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
Also read:
- Telangana: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జీవో
- Supreme Court: ఒక్కో కాలేజీకి రూ.10 కోట్లు జరిమానా

