బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు జనతా గ్యారేజీలా మారిందని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా చె ప్పుకొనేందుకు తమ దగ్గరికే వస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను(Silver Jubilee) ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కరెంటును నమ్మడం లేదని, అందుకే 200 జనరేటర్లను సమకూర్చుకున్నామని అన్నారు. తాము నిర్వహించేది ప్రభుత్వ వ్యతిరేక సభ కాదని, బీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవమని క్లారిటీ ఇచ్చారు. సభకు (Silver Jubilee) వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 40 వేల వాహనాలు వచ్చినా పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని, పది లక్షల వాటర్ బాటిల్స్, పది లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
ఎటు వైపు నుంచి వచ్చే వాహనాలకు అటు వైపే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దాదాపు 100 డాక్టర్స్ టీమ్స్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు.అతిపెద్ద బహిరంగ సభ కాబోతున్నదన్నారు.
కేసీఆర్ ను చూసేందుకు ఆయన మాట వినేందుకు గ్రామగ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. రైతులు ఎండ్లబండ్లపై సభకోసం తరలివస్తున్నారన్నారు.
Also read :
Pahalgam Attack: ఉగ్రదాడిలో మృతుల పేర్లు వెల్లడి

