BRS: కాంగ్రెస్​లోకి బీఆర్ఎస్​ఎమ్మెల్యే

BRS

హైదరాబాద్: బీఆర్ఎస్​ (BRS) పార్టీకి మరో షాక్​తగలనుంది. రాజేంద్ర నగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్  హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ సీఎం రేవంత్​రెడ్డిని కలిసిన ఆయన త్వరలో కాంగ్రెస్​పార్టీలో చేరనున్నట్లు ముఖ్యమంత్రికి చెప్పారు. అయితే నేడో, రేపో అనుచరులతో కలిసి హస్తం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా ప్రకాశ్​గౌడ్​కాంగ్రెస్ లో జాయిన్​అవుతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్(BRS)  ​నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఇప్పటికే హస్తం కండువా కప్పుకున్నారు.

Also read: