ఢిల్లీ: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో.. లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(KAVITHA) కవిత.. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటరాగేషన్ నుంచి బయటకు వచ్చారు. ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఈడీ ఆఫీసులోని విచారణ గది నుంచి రిసెప్షన్ వరకు వచ్చి.. కొంత సమయం తర్వాత తిరిగి మళ్లీ లోపలికి వెళ్లినట్లు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో కవిత (KAVITHA)వెంట ఇద్దరు అధికారులు ఉన్నారు. ఓ ఈడీ ఆఫీసర్.. మరో పోలీస్ ఉన్నారు. విచారణలో కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చారని కొందరు అంటున్నారు. ఎమ్మెల్సీ కవిత లంచ్ కోసమే బయటకు వచ్చారా లేక మరేదైనా కారణం ఉందా అని తెలియాల్సి ఉంది.

విచారణ గది నుంచి బయటకు వచ్చి.. మళ్లీ లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత వెంట అధికారులు ఉన్నారు. 15 నుంచి 20 నిమిషాల సమయంలోనే కవిత బయటకు వచ్చి.. లోపలికి వెళ్లిపోవటం విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. గత విచారణల్లో ఆయా వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ లో వాషింగ్ పౌడర్ పోస్టర్లు
వివిధ కేసుల్లో కేంద్ర సంస్థల విచారణను ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులపై ఉన్న కేసులు మాఫీ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోస్టర్లు వేశాయి. బీజేపీలో చేరితే కేసులన్నీ మాఫీ అయిపోతాయంటూ.. గతంలో బీజేపీలో చేరిన ప్రముఖ నాయకుల ఫొటోలతో కూడిన పోస్టర్లు, వాషింగ్ పౌడర్ అడ్వర్టయిజ్ మెంట్ తో మిక్స్ చేసి వేసిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
తుగ్లక్ రోడ్డులో సందడి
ఢిల్లీలోని తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం వద్ద సందడి నెలకొంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ ఇంటి వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. ఇంకా కొందరు తెలంగాణ భవన్ వద్ద వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో పలువురు ఈడీ ఆఫీసు రోడ్డులోనూ కవిత బయటికి వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నారు.
ALSO READ
DELHI LIQUOR SCAM:హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కాం
KOMATIREDDY VENKAT REDDY:చంపేస్తమంటుండ్రు

