బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేసన్ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టేనని ఎమ్మెల్సీ కవిత(Kavitha) చెప్పారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్లు తన దారికి రావాల్సిందేనని అన్నారు. నాలుగు రోజుల టైం తీసుకొనైనా తన దారికి వస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ బంజారాహిల్స్ లోని భారత జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 2018 చట్టాన్ని సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ను కవిత సమర్థించారు. తాను నిపుణులతో చర్చించిన మీదటే బిల్లుకు సపోర్ట్ చేసినట్ట చెప్పారు(Kavitha) . తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని, అది తన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
బనకచర్లపై సీఎంది మేకపోతు గాంభీర్యం
బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని అన్నారు. నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్లని చెప్పారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సిగ్గు లేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారని ఫైర్ అయ్యారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని అన్నారు. తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏమి లాభం లేదని అన్నారు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారని ఆరోపించారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళారని అన్నారు. బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా తాను కాలేజీ స్టూడెంట్ అని ఫీలవుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కలోనుంచి తీసేసానని, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పుకొచ్చారు కవిత.
కొప్పుల నియామకాన్ని స్వాగతిస్తున్నా
టీబీజీకేఎస్ ఇన్ చార్జిగా కొప్పుల ఈశ్వర్ ను నియమించటాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఈశ్వర్ స్వయంగా సింగరేణి కార్మికుడని అన్నారు. ఆయనకు సింగరేణిపై సంపూర్ణమైన అవగాహన ఉన్నదని చెప్పారు. జగిత్యాల జిల్లా పెద్దన్నగా ఈశ్వర్ ను పిలుచుకుంటామని చెప్పారు. తాను రేవంత్ రెడ్డి కేబినెట్ లో చేరుతానంటూ ఒక ఎమ్మెల్సీ(తీన్మార్ మల్లన్న) చేసిన కామెంట్స్ పై తాను స్పందించబోనని చెప్పారు. సదరు ఎమ్మెల్సీని జనాభా లెక్కల నుంచి తీసేశానని తెలిపారు.
Also Read :
- Ranya rao: కన్నడ నటి రన్యారావుకు ఏడాది జైలు
- Shubhanshu shukla: భార్యా పిల్లలను హత్తుకొన్న ఆస్ట్రనాట్

