K. Laxman : కాంగ్రెస్​కు బీఆర్ఎస్​గతే

బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్   లోక్​సభ ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ కాంగ్రెస్ లో ఆందోళన, అభద్రతా భావం ఎక్కువవుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (K. Laxman)విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ప్రజలనుంచి వ్యతిరేకత పెరుగుతుందన్నారు. 17 స్థానాల్లో ప్రచారంలో గానీ, జనాలను కలిసే విషయంలో బీజేపీ ముందుందని తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో లక్ష్మణ్ (K. Laxman)మాట్లాడుతూ ‘కరువుతో చాలీచాలని నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నయి. సానుభూతికోసం తనపై కుట్రలు పండుతున్నారు అని రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకున్నాడు. మాధవీలత అసదుద్దీన్ ఒవైసీని ప్రచారంలో ముచ్చెమటలు పట్టిస్తున్నరు. మజ్లిస్ ని గెలిపించమని రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ నాయకులే బాహాటంగా చెబుతున్నరు. మీ ప్రభుత్వం పడిపోతే బీజేపీ కారణం కాదు.. అది మీ ప్రభుత్వం లో ఉన్న వ్యక్తుల వల్లే జరగొచ్చు. అవినీతి పార్టీలకు కొమ్ము కాసే వ్యక్తులు జైళ్లలో ఉన్నరు. హామీలవిషయంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కి పడుతుంది. అబద్ధాలకు కాంగ్రెస్, అహంకారానికి బీఆర్ఎస్ లు మారుపేరు ఈ రెండు పార్టీలు. తనపై, తన ప్రభుత్వం పై కుట్ర జరుగుతుందని ప్రజలను మభ్య పెడుతున్నరు. మోదీ ప్రధాని అవుతారని బీజేపీ అంటుంది.. రాహూల గాంధీ ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్ రిఫరెండంగా ప్రకటిస్తారా..! అవకాశవాద రాజకీయాలను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలి. బీజేపీ అభ్యర్థులను మార్చే ఆలోచన లేదు. త్వరలో కంటోన్మెంట్ క్యాండిడేట్ ను ప్రకటిస్తం. బై ఎలక్షన్​లో గెలుస్తం’ అని ఆశాభావం వ్యక్తంచేశారు.

 

Also read :

Karimnagar : విభజన హామీల కోసం దీక్ష

Vikek Venkataswamy : నాపై అక్కసుతోనే అడ్వర్టైజ్మెంట్స్​ బంద్