పీఏసీ మీటింగ్ నుంచి బీఆర్ఎస్(BRS) సభ్యులు వాకౌట్ చేశారు. పీఏసీ ఎన్నిక జరగలేదని, నామనేషన్లు ఎవరు వేశారో బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇవాళ చైర్మన్ అరికపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి బీఆర్ఎస్ (BRS) సభ్యులు వేములు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎల్ రమణ హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే పీఏసీ ఎన్నిక సక్రమంగా జరగలేదని పేర్కొంటూ బీఆర్ఎస్ సభ్యులు బయటికి వచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సమాచారం ఇవ్వకుండా పీఏసీని ఎలా నియమిస్తారని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS) నుంచి హరీశ్ రావు, గంగుల కమలాకర్, తన పేరు మాత్రమే ప్రతిపాదించారని అన్నారు. అసలు అరికెపూడి గాంధీ పేరు ఎలా వచ్చిందో తమకు తెలియదని అన్నారు. కేంద్రంలో మోదీ మీరు చేస్తున్నట్టే చేశారా..? అని వేముల ప్రశ్నించారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు చెప్పి బయటికి వెళ్లిపోయారు.
Read more :
Lalbaugcha Raja : ఈ గణేశుడు.. కోటీశ్వరుడు

